సత్య నాదెళ్లకు అత్యధిక వేతనం ఈ ఆర్ధిక సంవత్సరంలో 79.1 మిలియన్ డాలర్లు 1 m ago
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల 2024 ఆర్థిక సంవత్సరానికిగానూ అత్యధిక వేతనం పొందబోతున్నారు. ఈ ఏడాది ఆయనకు 79.1 మిలియన్ డాలర్ల ప్యాకేజీని అందుకున్నారు, కృత్రిమ మేధస్సు (ఏఐ)లో బలమైన స్థానాన్ని విస్తరించడానికి కృషి చేసినందున ఆయనకు ఈ మెరుగైన ప్యాకేజీ దక్కింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇది 63 శాతం పెరుగుదలగా నమోదైంది. జూన్‌తో ముగిసిన సంవత్సరానికి నాదెళ్ల సంపాదనలో 90 శాతం మైక్రోసాఫ్ట్ షేర్లలో ఉందని కంపెనీ గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అతను మైక్రోసాఫ్ట్‌కు మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఆయన 2014లో 84 మిలియన్ డాలర్ల వేతనంతో ఉద్యోగం ప్రారంభించాడు. 2024 నాటికి ఆయన అత్యంత ఎక్కువ వేతనం పొందేలా కష్టపడ్డారు. ఈయన తరువాతి స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్ పే ప్యాకేజీ సంవత్సరానికి 25.8 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం పెరిగింది. ఆ తరువాత స్థానంలో ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ 29 శాతం వృద్ధితో 23.4 మిలియన్లకు చేరుకున్నాడు.
కటింగ్‌లు లేకపోతే మరో 5 శాతం అధనం
సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను ప్రతిబింబించేలా కంపెనీ చేస్తున్న మార్పులకు తన వ్యక్తిగత జవాబుదారీతనాన్ని ప్రతిబింబించేలా వేతన కోతను అంగీకరించకుంటే నాదెళ్ల వేతనం అదనంగా దాదాపు మరో 5 మిలియన్ డాలర్లు ఎక్కువగా ఉండేదని మైక్రోసాఫ్ట్ బోర్డ్ పరిహార కమిటీ గురువారం ఫైలింగ్‌లో రాసింది. కంపెనీ ఇటీవలి సంవత్సరాలలో యూఎస్ సైబర్ సేఫ్టీ రివ్యూ బోర్డ్ నుండి సాఫ్ట్‌వేర్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఈక్రమంలోనే బోర్డు కంపెనీ పనితీరును సమీక్షించింది. ఇందులో సత్య నాదెళ్ల అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని గుర్తించారు. అంతేకాకుండా కంపెనీ అత్యంత బలమైన పనితీరును సాధించడంలో కీలకపాత్ర పోషించారని కనుగొంది. కంపెనీ పెట్టుబడులు మరియు ప్రాధాన్యతల కొనసాగింపు కోసం ఆయన వ్యక్తిగతంగా బాధ్యత వహించారని బోర్డు గట్టిగా విశ్వసించింది.